ఈ బ్లాగు గురించి

నాకు నచ్చిన సినిమా పాటలపై నా స్పందనలు  “తెరచాటు చందమామ” అనే బ్లాగులో ప్రచురిస్తూ ఉన్నాను. వీటిలోంచి సిరివెన్నెల పాటలని “సిరివెన్నెల తరంగాలు” అనే బ్లాగులోకి ఈ మధ్యే మార్చాను. అదే పంథాలో వేటూరి పాటలకి కూడా ఒక ప్రత్యేక బ్లాగు ఉంటే బావుంటుందపించి ఈ “వేటూరి వైభవం” అనే బ్లాగుని మొదలుపెట్టడం జరిగింది.