వేటూరి పాటలో ఏముంది?

రంజని” సాహితీ సంస్థ వారు వేటూరి స్మృతిగా “పాటల పూదోట వేటూరి” అని ఒక పుస్తకం వెలువరించారు. వేటూరికి నివాళిగా రాసిన వ్యాసాల సంకలనం ఈ పుస్తకం. కొన్ని వ్యాసాల్లో వేటూరి పాటలకి ఇచ్చిన వివరణలు వేటూరి జన్మదినం సందర్భంగా అందరితో పంచుకునే ప్రయత్నమే ఈ వ్యాసం.

ఫ్రెంచి ఫిడేలు

ఒకసారి తనికెళ్ళ భరణి గారితో కలిసి నేనూ కొంతమంది మిత్రులం కార్లో రాజమండ్రి వెళుతున్నాం. వేటూరి గారి ప్రస్తావన వచ్చింది. “ఆ అంటే అమలాపురం” పాట పైకి వ్యాంప్ సాంగ్‌లా ఉన్నా లోపల ఎంతో చరిత్ర ఉందని నేనన్నాను. ఉదాహరణకి రాజమండ్రిని ప్రస్తావిస్తూ “చిత్రాంగి మేడల చీకట్ల వాడలో” అని ప్రయోగించారు వేటూరి. ఇది సారంగధ కథకు సంబంధించిన ప్రయోగం. అట్లే అదే పాటలో యానాం దగ్గర ఫ్రెంచి ఫిడేలు అనే పదం ప్రయోగించారు వేటూరి.

చారిత్రకంగా యానాం క్రీ.శ.1720లో ఫ్రెంచి వారి పాలనలోకి వెళ్ళింది కాబట్టి దాని ఆధారంగా వేటూరి “ఫ్రెంచి ఫిడేలు” అనే పదాన్ని ప్రయోగించారని నేనన్నాను. “అది కాకపోవచ్చయ్యా” అంటూ తనికెళ్ళ భరణి ఫోనందుకుని వేటూరి గారికే స్వయంగా ఫోన్ చేసి “గురువుగారూ, మీరు వాడిన ఫ్రెంచి ఫిడేలుకి అర్థమేంటి? మా వాడేదో చరిత్ర అంటున్నాడు” అని అడిగారు. భరణి గారు లౌడ్ స్పీకర్ ఆన్ చేశారు. అటునుండి మెల్లగా మార్దవంగా ఆ పుంభావ సరస్వతి మంద్ర స్వరంతో – “ఏముంది నాయనా. మనం చిన్నప్పుడు బళ్ళో చదువుకొనేటప్పుడు జేబుల్లో చేతులు పెట్టుకుని ఇబ్బందిగా చూస్తే “ఫిడేలు వాయిస్తున్నాడ్రా” అంటూ ఉండేవారు కదా” అంటూ చల్లగా చెప్పారు వేటూరి. ఇదీ వేటూరి విశ్వరూపమంటే

ఆకెళ్ళ రాఘవేంద్ర, “గోదారమ్మ కుంకుంబొట్టు” వ్యాసం

(సారంగధ కథ ఏమిటో, ఈ ఫ్రెంచి ఫిడేలు అర్థం ఏమిటో నాకు ఇంకా తెలియలేదు. మీకు తెలిస్తే కామెంట్లో చెప్పగలరు)
నవమి నాటి వెన్నెల

నవమి నాటి వెన్నెల నీవు
దశమి నాటి జాబిలి నేను
కలుసుకున్న ప్రతి రేయీ
కార్తీక పున్నమి రేయి

ఈ చిత్రంలో కథాపరంగా హీరోయిన్ జయసుధ కొత్త కుర్రాడైన హీరో కంటే పెద్దది కాబట్టి ఆమెను ముందుపుట్టిన నవమి నాటి వెన్నెలతో పోల్చి గూఢార్థంతో గుండెలకు అద్దారు వేటూరి.

వడ్డేపల్లి కృష్ణ, “సాటిలేని మేటి భావాల స్ఫూర్తి వేటూరి సుందరరామమూర్తి” వ్యాసం

యంగోత్రి, ఖంగోత్రి

ఒక విద్యార్థిని ప్రశ్న: మీరొక పాటలో యంగోత్రి, ఖంగోత్రి అనే కొత్త మాటలు ఉపయోగించారు. వాటిని ఎందుకు ఉపయోగించారు. వాటి అర్థం ఏమిటి?

వేటూరి: ఇవి అర్థం కాని పదాలు కావు. “యంగోత్రి” అంటే కుర్రదనీ, “ఖంగోత్రి” అంటే “కంగారుపడే యువతి” అనీ అర్థం. కొత్తపదాలు సృజించకుండా ఉంటే భాష ఎలా వృద్ధి చెందుతుంది? “మాయాబజారు”లో పింగళి గారు ఘటోత్కచుడి చేత “వెయ్యండయ్యా వీరతాడు” అనిపిస్తాడు. అలా కొత్తమాటలు పుట్టిస్తూ ఉండాలి. ఇప్పుడొస్తున్న కొత్త ట్యూన్లకి, కొత్త పద్ధతులకీ కొన్ని విన్యాసాలు తప్పనిసరి. “సావిత్రి” అనే పదం ఉందనుకోండి, ఆ పదాన్ని ఉపయోగించుకుని, “చలి సావిత్రి”, “సందిట్లో చలిసావిత్రి” అనే ప్రయోగాలు చేశాం. ఘన సంస్కృతికి సంబంధించిన నామవాచకంతో కొన్ని పదాలు కలిసినప్పుడు ఆ చమత్కారాలు నిలబడతాయి. యంగోత్రి, ఖంగోత్రి అంటే అక్కడ “త్రి” అనేది అంత్యప్రాసగా వస్తోంది. నడక కలిసిన నవరాత్రి అని వస్తుందనుకుంటాను – త్రి, త్రి అని రావడం వల్ల చమత్కారంగా ఉంటుంది కాబట్టి కొత్త పదాలు పడ్డాయి.

వేటురితో కళాశాల విద్యార్థినుల ఇంటర్వ్యూ వ్యాసం

బావరో బావర్చి

ఒకసారి నేను గురువుగారితో కలిసి హైదరాబాద్‌లో కారులో వెళ్తున్నాను. “ఇంద్ర” సినిమాకు అర్జెంటుగా పాట రాసివ్వాలి. అవతల ఒత్తిడి. ఈ ట్రాఫిక్ నుంచి బయటపడేదెప్పుడు? గురువు గారు పాట రాసేదెప్పుడు? నాకు ఒకటే టెన్షన్. నల్లకుంట నుంచి చిక్కడపల్లి మా ప్రయాణం. “తేజ గారూ (నన్ను అలాగే పిలిచేవారు), పాట ఫస్ట్ లైన్ రాసుకోండి అంటూ “అమ్మడూ అప్పచ్చీ, నువ్వంటేనే పిచ్చి” అన్నారు. నేను స్టన్ అయ్యాను. రెండో లైను చెబుతారేమోనని నేను ఆసక్తిగా చూస్తున్నాను. బావర్చీ హోటల్ దగ్గర ట్రాఫిక్ స్తంభించిపోయింది. గురువుగారు అటువైపు చూస్తూ “బావర్చి అంటే తెలుసా?” అన్నారు. “తెలియదు గురువుగారు” అన్నాను. బావర్చి అంటే వంటవాడు అన్నారాయన. ఇప్పుడెందుకు ఈ ప్రస్తావన అనుకున్నాను. అంతలోనే ఆయన – ఇప్పుడు రెండో లైను రాసుకోమంటూ “బావరో బావర్చి, వడ్డించు వార్చి” అనేశారు. నాకు నోట మాట రాలేదు. ఆ పాట ఎంత హిట్ అయ్యిందో అందరికీ తెలుసు. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే పాట రాయడానికి ఆయన ప్రత్యేకించి సమయం తీసుకోరు. ఎంతమందిలో ఉన్నా, ఎక్కడున్నా ఆయన మనసంతా పాటై పరవళ్ళు తొక్కుతున్నప్పుడు, మళ్ళీ ప్రత్యేకించి సమయం కావాలా? అనుకున్నాను.

వేటూరి శిష్యుడు ధర్మతేజ, “దొరకునా ఇటువంటి సేవ” వ్యాసం

“ఎంత మాత్రమున ఎవ్వరు తలచిన అంత మాత్రమె నీవు” అని అన్నమయ్య ఒక కీర్తనలో అన్నాడు. ఇది వేటూరికీ వర్తిస్తుంది. కొన్ని సార్లు ఆయన చాలా అల్పుడనిపిస్తాడు, అంతలోనే మహోన్నతుడనిపిస్తాడు. “గంగిగోవు పాలు గరిటెడైనా చాలు” అనుకుని ఆయన గొప్ప గీతాలని మనసుకి హత్తుకున్నప్పుడల్లా కలిగే స్పందన అనిర్వచనీయం. అందుకే ఆయన మహాకవి. ఆయనకి అంజలి ఘటిస్తూ, ఆయన్నుంచి ప్రేరణ పొందుతూ, “పాటై బ్రతుకైన పసివాడికి” వినమ్రంగా జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను.

13 thoughts on “వేటూరి పాటలో ఏముంది?

  1. వేటూరి పాటలో ఏముంది అడిగారు కాబట్టి !

    వేటూ వుంది, ట్యూనూ వుంది. వారి రచనా ‘వే’ టూర్!!

    చాలా బాగా స్నిప్పెట్స్ ఇచ్చారండీ.

    ఆ మధ్య యుట్యూబ్ లో వారి కొన్ని ముఖాముఖీ లు చూసాను.

    చిరంజీవి గారి ని ఉద్దేశించి, వారి రాజకీయ ప్రస్థానాన్ని , ‘ బృందావనాన్ని వదిలి పెట్టి దండకారణ్యం లోకి వెళ్లి పోయారంటూ ‘ ఓ సభలో ఆయనన్న మాట అమోఘం !

    చీర్స్
    జిలేబి

    Like

  2. వేటూరి గురించి చాలా చక్కని విషయాలను తెలిపావు సోదరా — సంతోషం గా ఉంది. ముఖ్యంగా “నవమి నాటి వెన్నెల నీవు, దశమి నాటి జాబిలి నేను” పాటకు ఇచ్చిన వివరణ చాలా బాగుంది.

    Like

  3. చిత్రాంగిసారంధరుల కథ అడిగారు కదా. పూర్వం ఒకానొక రాజ్యంలో మహారాణియైన చిత్రాంగి సవతి కుమారుడైన సారంగధరుని వలచి తిరస్కరింపబడి బలాత్కరింపబోయాడని అతడిపై అపవాదుమోపుతుంది. రాజు ముందువెనుకలు చూడక కుమారుని బంధించి, అతడి కాలుసేతులు నరికించి అడవిలో పడవేయిస్తాడు. ఒక శివభక్తుని వలన రక్షింపబడి సారంగధరుడు పరమభక్తునిగా మారుతాడు.

    ఈ కథాస్థానం వివాదాస్పదంగా మారింది. కొందఱు నన్నయ్యగారిని ఆంధ్రమహాభారతరచన చేయమని ప్రార్థించిన రాజరాజనరేంద్రుడే ఆ రాజని, సారంగధరుడు ఆయన కుమారుడని, కథాస్థానం రాజమహేంద్రవరమని చెపుతారు. ఇదియే ఇతివృత్తంగా శ్రీపాదసుబ్రహ్మణ్యశాస్త్రిగారు రాజరాజు అనే ఒక నాటకము రచించారు పై కథను ఆంధ్ర మహాభారత రచన అరణ్యపర్వంలో ఆగిపోవడానికి ముడిపెట్టి వ్రాసుకుపోయారు. అంతకు ముందు గురజాడ అప్పారావుగారు ౧౮౮౩లో ఇదే కథను ఆంగ్లపద్యకావ్యముగా వ్రాసారు.

    పలు పిఎచ్డీ పట్టాల పెట్టు వేటూరి ప్రభాకరశాస్త్రిగారి పరిశోధనలు. వారు పై కథను వ్యతిరేకించినారు. రాజరాజనరేంద్రునకు తప్పుగా అపప్రథ అంటగట్టరాదని ఆయన ఆంధ్రపత్రికలో విస్తృతమైన వ్యాసం వ్రాసినట్లు చదివాను. మాళవరాజ్యం (ఈ కాలంలో మాల్వా, మధ్యప్రదేశం రాజస్థానాలలో ఉన్నది) లోని మాంధాతపురం కథాస్థానమని ఆయన అభిప్రాయం.

    Like

  4. @గిరి

    మీరిచ్చిన వివరణకు ధన్యవాదాలు. మంచి వివరాలు తెలిపారు. అయితే “చిత్రాంగి మేడల చీకట్ల వాడలో” అన్నది సారంగధర కథలో ఉన్న ప్రయోగమా?

    Like

  5. నమస్కారం ఫణింద్ర గారు,

    మీ బ్లాగు చాల బాగుంది. ఈ మధ్యనే మా అన్నయ్య ద్వార మీ బ్లాగ్ గురించి తెలుసుకున్నాను. దాదాపు మీ పాత టపాలు అన్ని చదివేస. నాకు కూడా శాస్త్రి గారు అంటె చాల అభిమానం.
    ఇంక అసలు విషయం. నేను, మీరు పైన పేర్కొన్న ‘పాటల పూదోట వేటూరి’ అనే పుస్తకాన్ని కొనదలచుకున్నాను. నేను బెంగుళూరు లో నివసిస్తున్నాను. ఏదైనా online website ద్వార ఈ పుస్తకాన్ని కొనే వీలుంటే తెలుపగలరు.

    Like

  6. http://www.archive.org/details/SaarangadharaCharitramu లేదా
    http://www.archive.org/details/saarangadharacha022730mbp

    ఇదీ సారంగధరుని కథ. (పైన నీ టపాలో “సారంగధర” కథ అని ఉండాలి.) ఈ కథతో “సారంగధర” అన్న పేరుతో 1957లో ఒక చలనచిత్రం వచ్చింది. (ఎన్టీయార్, భానుమతి ప్రధాన పాత్రలలో నటించారు.) ఆ చిత్రం గుఱించి యిక్కడ (కథాసంగ్రహంతో సహా) చదవవచ్చు: http://www.telugucinema.com/c/publish/movieretrospect/saarangadhara1957.php

    Like

  7. వేటూరి గారి పాటలు అన్నీ నేను వినలేదు, ఏదో controversy కోసమని కాదు కాని, నాకు తెలిసింది చెప్తున్నాను. గీతాంజలి సినిమాలో, “ఓ పాపా లాలి” పాటలో ఇలా ఉంది. “ఇరు సందెలు కదలాడే ఎద ఊయల ఒడిలో” (తడి నీడలు పడ నీకే నా దేవత గుడిలో, చలి ఎండకు సిరివెన్నెల కిది నా మనవి, ఓ పాపా లాలి …) , అయితే ఎటువంటి అలంకారం అయినా బయటకి చెప్పేది, చెప్పాలని అనుకున్నది రెండూ తార్కికం గా సరిపడాలి. అప్పుడే అది సరైన భాషా ప్రయోగం అవుతుంది. “ఒక పాప, ఊయల” మీద అని, ఆమె జీవితం, మరణం, ఆశా భావం, ప్రేమ అన్నీ చెప్పాలనుకున్నారు ఆయన. అయితే పాపల ఊయల ఇరు సందెలే కదులుతుందా? చంటి పాపల ఊయల, రోజుకి ఎప్పుడో ఒక సారేమి కదలదు కదా, ఎప్పుడైనా కదలచ్చు!? ఆయన పగలుని జీవితం అంటే (చలి ఎండకు సిరివెన్నెలకు …, ప్రాతః సంధ్య, సాయం సంధ్య, వీటిని చావు, బ్రతుకు గా భావించి మనవి చేస్తున్నారు పాటలో, ఏ తడి నీడలూ పదనివ్వద్దని (విషాద చాయలు)), రాత్రి మరణించిన తరువాతి సమయం అవుతుంది. వాటి గురించి తెలిసినట్టు వ్రాయడం సరైనది కాదు. ఎలా చూసినా ఇందులో ఈ అలంకారం పూర్తిగా అన్వయింప బడలేదు. అంత మంచి పాటలో ఒక చిన్న అపశ్రుతి దొర్లడం జరగదు, కాని ఎందుకో.

    Like

    1. చాలా మంచి వివరణ. నాకూ ఇదే సందేహం వచ్చింది. మీరు మొదటి చరణం లైన్లు రెండో చరణం లైన్లూ కలిపేశారు. వేటూరి రాసినది ఇది:

      ఇరుసందెలు కదలాడె ఎద ఊయల ఒడిలో
      సెలయేరుల అలపాటే వినిపించని గదిలో
      చలిఎండకు సిరివెన్నెలకిది నా మనవి

      ఈ లైన్లు నాకు అర్థం కాలేదు. మీరు వివరిస్తే కొంత అర్థమైంది కానీ, ఇంకా పూర్తిగా మింగుడు పడలేదు. “కదలాడె” అంటే కదులుతున్న అని కాకుండా “మెదులుతున్న” అని అర్థం తీసుకుంటే మొదటి లైనుకి అర్థం – ఎదలో రెండు సందెలూ మెదులుతున్నాయి, వెలుతురూ కావొచ్చు, చీకటీ కావొచ్చు. కానీ మొత్తంగా అర్థం కాలేదు.

      Like

      1. sir,

        why people look in to or take up unknown meanings for a simple lyric like this, this is a regular happening for many explanations for telugu lyrics which are explained in a totally different way than they are intended to,

        the meaning of the o paapa laali, lines mentioned above,
        first line says, like hope and despair and life and death, both thoughts are hanging around in the heart as a sway of labyrinth,
        here the meaning is a straight one,
        second line, in the room of despair or at the time of hopelessness one cannot enjoy the creation in the short stay of life,

        third line, i am sharing my state of mind with the cool sunshine and brilliant moonlight, in the season of winter, meaning is i am sharing my thoughts with both of you at the fag end of my life, these two things happen in the winter alone,

        oo paapa laali, janmake laali, premake laali,
        main line,

        to the young life solace, solace to the birth attained, solace to the love shared, shall i sing the solace as sweetly and comfortingly,

        this is the true meaning of this above mentioned lines,

        Like

      2. Thanks Ravi! You very nicely translated & explained the 3 lines in English.
        When I wrote the original comment, I did not understand these lines but
        later I understood the meaning in a way that is very close to what you
        wrote. However, in the last line when Veturi writes – “idi naa manavi”, one
        asks the question – “what is that “manavi” he is making? “manavi” is not
        exactly “sharing my thoughts” as you translated. It is often understood as
        “request”. So what is he requesting the cool sunshine and brilliant
        moonlight?

        Like

  8. vyaasam lO yaanam-french fidElu anTE artham kaalEdu ani annaru, teliyaka aDigarO, telusukundaamu ani aDigaarO artham kaala, asleelatha anukOkanDi, veturi garu akkaDa(vyaasam lO phone lO chepparu ani annarugaa daaniki) icchina explanation ki artham, prasthutham college kurraLLa bashalO aithE guitar vaayinchaDam anTaaru(evadaina thoDa kaani, inkaastha paina kaani jEbulO cheyyi peTTi gOkkunTE) guitar vaayinchindi chaallE aapu anTaaru(residential college lO chaala sarva saadharanamuga vaaDE padam adi)adE aayana eekkaDiki veLLinaa ee vaayinchE(gOkkunE) alavaaTu pOvunaa ani.

    Like

    1. ఈ అర్థం నాకు స్ఫురించినా అది కాదేమో అనుకున్నాను. మీరు చెప్పినది చదివాక అర్థం ఇదేనేమో అనిపిస్తోంది.

      Like

Leave a comment